News December 1, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: డిసెంబర్ 01, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5:13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:30 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:05 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 1, 2024
FBI డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్
భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)కు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించనున్నట్లు ప్రకటించారు. కశ్యప్ అమెరికాలో అవినీతి నిర్మూలనకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. 1980లో న్యూయార్క్‌లో జన్మించిన ఆయన.. నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం విభాగాల్లో పని చేశారు.
News December 1, 2024
పెరిగిన కోడిగుడ్డు ధరలు
దేశవ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్మే అవకాశం ఉంది. చలికాలంలో గుడ్డు వినియోగం పెరగడం, క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో వాడనుండటంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మున్ముందు ధర మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మీ దగ్గర గుడ్డు రేటు ఎంత ఉంది? కామెంట్ చేయండి.
News December 1, 2024
ఈనెల 6న బీజేపీ బహిరంగ సభ
TG: హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఈనెల 6న బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవ కార్యక్రమాలకు కౌంటర్‌గా నిర్వహించనున్న ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నిర్ణయించింది.