News December 1, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 1, 2024
BRICS కొత్త కరెన్సీ.. ట్రంప్ హెచ్చరికలు
US డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు BRICS దేశాలు ఓ <<14438627>>కొత్త కరెన్సీని<<>> తీసుకొస్తున్నాయి. దీనిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా కొత్త కరెన్సీని సృష్టిస్తే 100 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్యానికి గుడ్‌బై చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ స్థానాన్ని BRICS భర్తీ చేసే అవకాశం లేదన్నారు.
News December 1, 2024
రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే?
ప్రభుత్వాలు కేజీ రేషన్ బియ్యానికి రూ.43 ఖర్చు పెడుతున్నాయి. సబ్సిడీ కింద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి. క్వాలిటీగా ఉండవనే భావనతో 70-80% మంది వాటిని తినకుండా KG రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. అక్రమార్కులు వీటిని ప్రాసెస్ చేసి KG రూ.80-100 వరకు విదేశాలకు ఎగుమతి చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వాలు బియ్యం బదులు నేరుగా సబ్సిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తే ఈ దందాను ఆపే అవకాశం ఉంది. మీరేమంటారు?
News December 1, 2024
‘పుష్ప-2’: ఒక్క టికెట్ రూ.1,200.. కరెక్టేనా?
‘పుష్ప-2’ ప్రీమియర్ టికెట్ ధరలను రూ.800 పెంచడంతో మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ.1,200, సింగిల్ స్క్రీన్లో రూ.1,000 అవుతోంది. ఒక్క షోకు ఇంత రేటా? అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అభిమానులు మాత్రమే ప్రీమియర్స్ చూస్తారని, వాళ్లు యాక్సెప్ట్ చేయడం వల్లే ధరలు పెంచుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్రాంతికి సైతం టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?