News December 1, 2024

గండేపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామ శివారులో శనివారం టిప్పర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. ఎల్లమిల్లి గ్రామానికి చెందిన కర్ణం నాగరత్నం (58), ఎల్లమెల్లి నుంచి తాళ్లూరు గుడికి వచ్చి దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో మహిళ మృతి చెందింది. లారీ డ్రైవర్ అతి వేగంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Similar News

News December 27, 2024

తూ.గో: న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు

image

న్యూ ఇయర్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని తూ.గో. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. కొవ్వూరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్పీ తనిఖీలు చేశారు. మద్యం సేవించి రోడ్లపై అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సైలెన్సర్లు పీకి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు సమయపాలన పాటించాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు.

News December 26, 2024

శంఖవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

image

శంఖవరం మండలం వేలంగి-పెద్దమల్లాపురం మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం పోలీసుల వివరాల మేరకు.. పెదమల్లాపురానికి చెందిన బోడోజు వెంకట రమణ (18), బలుం సుబ్రహ్మణ్యం (24) బైక్‌పై వేళంగి నుంచి పెదమల్లాపుంకు వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 26, 2024

తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి

image

తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి ఝాన్సీ రాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.