News December 1, 2024

రాష్ట్రంలో మళ్లీ VRO వ్యవస్థ?

image

TG: రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు VROలను నియమిస్తారని తెలుస్తోంది.

Similar News

News December 1, 2024

భారీ జీతంతో ఉద్యోగాలు.. 10 రోజులే ఛాన్స్

image

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లో 50 సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగంలో డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/పీజీ డిప్లొమా చేసిన వారు అర్హులు. వయసు 45 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.30,000 నుంచి రూ.1.20లక్షల వరకూ జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: <>careers.ntpc.co.in<<>>
లాస్ట్ డేట్: డిసెంబర్ 10, 2024.

News December 1, 2024

నెటిజన్లకు క్రికెటర్ ప్రశ్న.. సమాధానం తెలుసా?

image

బ్రిటిష్ క్రికెటర్ అలాన్ విల్కిన్స్ నెటిజన్ల మెదడుకు పనిచెప్పారు. టెస్టు క్రికెట్‌లో కేవలం ఐదుగురికే సాధ్యమైన ఓ రికార్డు గురించి ఆయన ప్రశ్నించారు. ‘టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీసం పది టెస్ట్ సెంచరీలు పూర్తిచేసి, 150+వికెట్లు పడగొట్టి 3,000+ రన్స్ చేసిన రికార్డు ఐదుగురిపైనే ఉంది. వారెవరో చెప్పగలరా?’ అని ఆయన ప్రశ్నించారు. అందులో రవి శాస్త్రి, బెన్ స్టోక్స్‌లు ఉండగా మరో ముగ్గురి పేర్లు గెస్ చేయండి.

News December 1, 2024

IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు

image

2023-2024కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితోనే గడువుగా ముగియగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.