News December 1, 2024
పొద్దున్నే కరివేపాకులు తింటే..

పరగడపున కరివేపాకులు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు, వైద్యులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్‌ను తగ్గించగలదు. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లతో జుట్టు రాలడం తగ్గుతుంది. బ్లడ్ షుగర్‌ను నియంత్రించి ఇన్సూలిన్ సెన్సిటివిటీని చక్కదిద్దగలదు. కొవ్వును కరిగించి, మెటాబాలిజాన్ని మెరుగుచేసి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. లివర్, స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుంది.
Similar News
News March 12, 2026
పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ

AP: సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. MRO, MPDO, MEO, డిప్యూటీ MPDO, వీరి కంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టేవరకు వీరు పాలన కొనసాగించాలంది. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.
News March 12, 2026
కొవిడ్ టీకాతో మరణాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కొవిడ్ టీకా తర్వాత కొన్ని మరణాలు, తీవ్రమైన అనారోగ్యం సంభవించినట్లు GOVT డేటాలో వెల్లడైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటప్పుడు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేసింది. వారి కోసం నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ(నష్టం/ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో నిరూపించాల్సిన అవసరం లేకుండా పరిహారం ఇవ్వడం)ని రూపొందించాలని ఆదేశించింది. రచన గంగు వేసిన కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది.
News March 12, 2026
GOOD NEWS: వారికి 15 రోజుల సెలవులు

AP: GOVT ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు దాదాపు 50వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.


