News December 1, 2024

లగచర్ల ఘటన.. శ్రీశైలంపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు

image

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి నేపథ్యంలో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు కట్టేవాళ్లా? అంటూ ‘రైతు పండుగ‘ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విపక్షాల ఉచ్చులో పడొద్దు.. కుటుంబాలు నాశనం చేసుకోవద్దు.. మహబూబ్‌నగర్‌ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని అన్నారు.

Similar News

News March 15, 2026

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 15, 2026

కర్నూలు: నకిలీ మెసేజ్‌లతో జాగ్రత్త!

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.

News March 15, 2026

విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్‌లకు మోసపోవద్దు: శివశంకర్