News December 1, 2024

రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వని సీఎం!

image

TG: నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కనబెట్టేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. సీఎం దీనిపై ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చేది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరోవైపు రైతులు బోనస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతకుముందు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంతో రైతుభరోసాపై అయోమయం నెలకొంది.

Similar News

News December 1, 2024

రూట్ ప్రపంచ రికార్డు

image

ENG క్రికెటర్ రూట్ ప్రపంచ రికార్డు సృష్టించారు. టెస్టు 4th ఇన్నింగ్సుల్లో అత్యధిక రన్స్(1,630) చేసిన ఆటగాడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో సచిన్(1,625), కుక్(1,611), గ్రేమ్ స్మిత్(1,611), చందర్‌పాల్(1,580) ఉన్నారు. అలాగే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక స్ట్రైక్ రేటు(88.08)తో వెయ్యికి పైగా రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా డకెట్(ENG) ఘనత సాధించారు. 2010లో సెహ్వాగ్ 90.80 స్ట్రైక్ రేటుతో 1,422 రన్స్ చేశారు.

News December 1, 2024

చైతూ-శోభితకు నాగార్జున ఖరీదైన గిఫ్ట్?

image

నాగచైతన్య, శోభితల వివాహం ఈ నెల 4న జరగనుంది. పెళ్లి సందర్భంగా వారికి నాగార్జున ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల నాగ్ రూ.2.10 కోట్ల విలువైన లెక్సస్ ఎలక్ట్రిక్ కారు కొన్నారు. కొడుకు, కోడలికి బహుమతి ఇచ్చేందుకే దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలను సైతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News December 1, 2024

తుఫాన్ ఎఫెక్ట్.. రికార్డు స్థాయి వర్షపాతం

image

AP: ఫెంగల్ తుఫాను కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. పుత్తూరులో అత్యధికంగా 187MM వాన పడింది. సూళ్లూరుపేటలో 150, నగరిలో 120, నాయుడుపేటలో 117, తిరుపతి సిటీలో 116, చాలా చోట్ల 87-110MM వర్షం కురిసింది. ఇవాళ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. ఉత్తరాంధ్ర, కాకినాడ ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీస్తాయని చెబుతున్నారు.