News December 1, 2024
‘బూడిద’తో కాసుల వర్షం.. అందుకే పోటీ!
AP: జమ్మలమడుగు పరిధిలోని RTPPలో ఫ్లైయాష్(బూడిద) కోసం ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ మధ్య <<14738601>>గొడవ<<>> చర్చనీయాంశంగా మారింది. పేరుకు బూడిదే అయినా ఇది రూ.కోట్లు కురిపించే కల్పవృక్షం. RTPPలో రోజూ 19వేల టన్నుల బూడిద ఉత్పత్తవుతుంది. దీన్ని ఉచితంగానే తీసుకెళ్లొచ్చు. సిమెంట్ కంపెనీలు, ఇటుకల ఫ్యాక్టరీల్లో వాడతారు. టన్ను బూడిద రూ.3,400కు చేరడంతో దాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
Similar News
News December 1, 2024
ఈ-సిగరెట్ తాగుతున్నారా..?
ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి హానికరమని Radiological Society of North America అధ్యయనంలో తేలింది. నికోటిన్ రహితంగా భావించే వేప్ లిక్విడ్‌లో నికోటిన్‌తో పాటు ప్రొపిలీన్ గ్లైకాల్స్, గ్లిసరిన్, ఫ్లేవరింగ్, రసాయనాలు ఉంటాయని American Lung Association తెలిపింది. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, ఊపిరితిత్తులు శరీరంలోకి ఆక్సిజన్ తీసుకొనే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తేల్చాయి.
News December 1, 2024
ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు పెరుగుతాయా?
ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. దేవర సినిమా కంటే అదనంగా పెంపు ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి 23 వరకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం <<14751051>>అనుమతిచ్చిన<<>> విషయం తెలిసిందే. ఈ ధరలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 1, 2024
పిల్లలకు పిరుదులపై టీకా వద్దు
పిల్లలకు కుక్క కరిస్తే రేబిస్ వ్యాక్సిన్ సహా చిన్నవయసులో వేయించే ఇతరత్రా వ్యాక్సిన్‌లను పిరుదులపై వేయించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పిరుదులపై వ్యాక్సిన్ వేయించడం వల్ల పిల్లల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు. ఏ టీకానైనా సరే వయసు ఆధారంగా తొడలో లేదా భుజంపై వేయించాలని, అప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని పీడియాట్రిక్ వైద్యురాలు శివరంజని సంతోష్ తెలిపారు.