News December 1, 2024
పంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్?
TG: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను గతంలోలాగా సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. రెండు టర్మ్‌ల రిజర్వేషన్ విధానాన్ని, సర్పంచ్‌పై కలెక్టర్ వేటు వేసే అధికారాన్ని తొలగించనున్నట్లు సమాచారం.
Similar News
News December 1, 2024
ఏపీలో పుష్ప-2 టికెట్ ధరలు పెరుగుతాయా?
ఏపీలోనూ పుష్ప-2 టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. దేవర సినిమా కంటే అదనంగా పెంపు ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయని తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి 23 వరకు టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం <<14751051>>అనుమతిచ్చిన<<>> విషయం తెలిసిందే. ఈ ధరలపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 1, 2024
పిల్లలకు పిరుదులపై టీకా వద్దు
పిల్లలకు కుక్క కరిస్తే రేబిస్ వ్యాక్సిన్ సహా చిన్నవయసులో వేయించే ఇతరత్రా వ్యాక్సిన్‌లను పిరుదులపై వేయించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పిరుదులపై వ్యాక్సిన్ వేయించడం వల్ల పిల్లల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు. ఏ టీకానైనా సరే వయసు ఆధారంగా తొడలో లేదా భుజంపై వేయించాలని, అప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని పీడియాట్రిక్ వైద్యురాలు శివరంజని సంతోష్ తెలిపారు.
News December 1, 2024
అప్పుడే ఓపెనర్స్ అని నిర్ణయించేశారుగా!
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీల, స్టార్ పేసర్‌ల కుమారులకూ ఫ్యాన్స్ ఆర్మీలు పుట్టుకొస్తున్నాయి. హిట్ మ్యాన్ కొడుకు అహాన్, కోహ్లీ కుమారుడు అకాయ్, అంగద్ బుమ్రాలు టీమ్ఇండియాకు ఆడతారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్ వరల్డ్ కప్‌లలో అకాయ్, అహాన్‌లు ఓపెనర్స్‌గా, అంగద్ బౌలర్‌గా ఆడతారంటున్నారు. దీంతో అప్పుడే నిర్ణయించేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.