News December 1, 2024

మాగుంట హత్యకు నేటికి 29 ఏళ్లు..!

image

ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి. నెల్లూరుకు చెందిన ఆయన 1991లో ఒంగోలు MPగా గెలిచారు. మాగుంట ట్రస్ట్‌తో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ, కళాశాల నిర్మాణాలు చేపట్టారు. ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) నక్సలైట్లు 1995 డిసెంబర్ 1న హత్య చేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోదరుడు శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఒంగోలు MPగా ఉన్నారు.

Similar News

News January 12, 2026

ప్రకాశం జిల్లాకు లేడీ ఆఫీసర్.. నేపథ్యం ఇదే.!

image

ప్రకాశం జిల్లా జేసీగా నియమితులైన <<18835611>>కల్పనా కుమారి<<>> ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2018 బ్యాచ్ IASగా ఎంపికయ్యారు. ఈమె సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, విశాఖపట్నం JCగా, నంద్యాల సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం గిరిజన సహకార సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్వస్థలం ఢిల్లీ కాగా, ఐఏఎస్‌కు ముందు ఇంజినీర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

News January 12, 2026

ఒంగోలు: వివేకానంద సేవలు ఎనలేనివి

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు తదితరులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన సేవలను కొనియాడారు. స్వామి వివేకానంద తన రచనల ద్వారా యువతకు మార్గదర్శకత్వం చేశారన్నారు.

News January 12, 2026

ప్రకాశం జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక.!

image

ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ సైతం సోమవారం ఏర్పాటు చేశారు.