News December 1, 2024

గ్యాస్ సిలిండర్ ధర పెంపు

image

ప్రతినెలా మొదటి రోజున ఎల్పీజీ ధరల్లో మార్పులు చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ రేట్లు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరలను రూ.16.5 మేర పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం HYDలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,044, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉన్నాయి.

Similar News

News March 12, 2026

సంజూకు జట్టే ముఖ్యం.. సెంచరీలు కాదు: సూర్య

image

T20WCలో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్య ప్రశంసలు కురిపించారు. ‘చివరి 3 మ్యాచుల్లో ఆయన 97*, 89, 89 స్కోర్లు చేశారు. కావాలనుకుంటే వాటిని సెంచరీలుగా మలిచేవారు. కానీ 89 నుంచి 100కు చేరడానికి 10 బంతులను తీసుకుంటే నాన్ స్ట్రైకర్ నుంచి 6 బాల్స్‌ను లాగేసుకున్నట్లే. సంజూకు సెంచరీల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఆయన అలా ఆడారు కాబట్టే దూబే 6 బంతుల్లో 28 రన్స్ కొట్టారు’ అని పేర్కొన్నారు.

News March 12, 2026

మనుషులూ 200 ఏళ్లు బతకొచ్చు!

image

భూమిపై ఎక్కువకాలం బతికే జీవుల్లో తిమింగలం ఒకటి. అందులోనూ Bowhead రకం 200 ఏళ్లు జీవిస్తుంది. దీని దీర్ఘాయువుకు క్యాన్సర్, ఇతర వ్యాధుల నియంత్రణకు DNA రిపేర్ ప్రొటీన్‌గా పిలిచే CIRBP కారణమని రోచెస్టర్ వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీన్ని మానవ కణాలు, కొన్ని రకాల ఈగల్లో ప్రవేశపెట్టగా DNA రిపేర్ సాధ్యమైంది. ఈగలు ఎక్కువ కాలం జీవించాయి కూడా. మానవుల్లోనూ సక్సెస్ అయితే 200Y బతకడం సాధ్యమేనంటున్నారు.

News March 12, 2026

మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

image

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.