News December 1, 2024

రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు

image

ఏపీలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సంక్రాంతి కానుకగా అర్హులకు జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేస్తుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది.

Similar News

News March 25, 2026

మమత ముస్లింలకు ఏమీ చేయలేదు: ఒవైసీ

image

పశ్చిమ బెంగాల్ ముస్లింలకు సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేదని ఒవైసీ విమర్శించారు. ఆమె రాజకీయాలే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడ్డాయని.. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ముస్లిం నాయకత్వం లేని రాష్ట్రాల్లో వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. హుమాయున్ ఏజేయూ పార్టీతో కలిసి బెంగాల్‌లో ముస్లింల రాజకీయ నాయకత్వ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

News March 25, 2026

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

image

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.

News March 25, 2026

రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

image

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.