News December 1, 2024

టీచర్ల బదిలీల రోడ్ మ్యాప్ ఇదే

image

AP: ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 25, జనవరి 25, ఫిబ్రవరి 10 తేదీల్లో ఉపాధ్యాయుల ప్రొఫైల్ అప్డేషన్ చేస్తారు. ఫిబ్రవరి 15, మార్చి 1, 15 తేదీల్లో సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారు. ఏప్రిల్ 10-15 వరకు HMలు, 21-25 వరకు SA, మే 1-10 వరకు SGTల బదిలీలు పూర్తిచేస్తారు. అలాగే ఏప్రిల్ 16-20 వరకు HMలు, మే 26-30 వరకు SAల ప్రమోషన్లు చేపడతారు.

Similar News

News January 13, 2026

వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: మంత్రి

image

AP: రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ₹567 కోట్లు విడుదల చేసిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం కింద ఇచ్చే ₹2600 కోట్లలో ఇవి చివరి విడత నిధులన్నారు. PHC భవనాలు, డయాగ్నొస్టిక్ పరికరాలు, ఇతర అభివృద్ధి పనులకు వీటిని వినియోగిస్తారు. కాగా FY25-26 నిధులు, ఖర్చుపై మంత్రి సమీక్షించారు. కేంద్ర నిధులను పూర్తిగా సాధించాలని అధికారులను ఆదేశించారు. విఫలమైతే సంబంధిత అధికారులే బాధ్యులని స్పష్టం చేశారు.

News January 13, 2026

విజయ్‌కు మరోసారి CBI నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనలో TVK పార్టీ అధినేత విజయ్‌కు <<18836427>>సీబీఐ<<>> మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. కాగా నిన్న విజయ్‌ను సీబీఐ 7 గంటల పాటు ప్రశ్నించింది. గతేడాది జరిగిన ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

News January 13, 2026

భోగి మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలి: CM

image

AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి జరుపుకుంటున్న ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షిస్తున్నా. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని.. అందుకు అండగా ఉంటానని తెలియజేస్తున్నా. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.