News December 1, 2024
జగిత్యాల: కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు కౌన్సెలింగ్

జగిత్యాల జిల్లాలో కన్నతల్లిని శ్మశానంలో వదిలిన కుమారులకు ఆర్డీఓ మధుసూదన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు కుమారులతో సమ్మతి పత్రాలు రాయించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు ఆలకొండ రాజవ్వను ఆమె కుమారులు తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, సఖీ అడ్మిన్ లావణ్య, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
కరీంనగర్: ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన: కలెక్టర్

గంగాధర మండలం గట్టుబుత్కూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోతరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంగ్లీష్ పాఠాలను బోధించారు.
News March 12, 2025
KNR: ఇంటర్ పరీక్షలకు 398 మంది గైర్హజరు!

కరీంనగర్ జిల్లా లో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా సెకండ్ ఇయర్ పేపర్2 మ్యాథమెటిక్స్, బోటనీ ,పొలిటికల్ సైన్స్ ప్రశాంతంగా ముగిసినట్లు బుధవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 16256 మంది విద్యార్థులకు 15858 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 398 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
KNR: సీలింగ్ ఫ్యాన్ పడి విద్యార్థినికి గాయాలు

పరీక్ష రాస్తుండగా విద్యార్థినిపై ఫ్యాన్ పడి గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ నగరంలోని సహస్ర జూనియర్ కాలేజీలో జరిగింది. నీలి శివాన్విత అనే ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని పరీక్ష రాస్తోంది. ఈక్రమంలో సీలింగ్ ఫ్యాన్ ఆమె తలపై పడడంతో గాయాలయ్యాయి. నిర్వాహకులు ప్రథమ చికిత్స చేసి ఎగ్జామ్ రాయించారు.