News December 1, 2024
ACCIDENT UPDATE: మృతుల్లో ఇద్దరు డాక్టర్లు, ఒకరు డ్రైవర్

అనంతపురం జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విడపనకల్లు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరు నుంచి బళ్లారికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు యోగేశ్, గోవిందరాయ బళ్లారి ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులుగా, అమరేశ్ డ్రైవర్‌గా పోలీసులు మరో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు.
Similar News
News March 10, 2026
బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు: ఏసీబీ డీఎస్పీ

అనంతపురం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు వచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పలువురి ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్స్ అప్రూవల్ విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్లానింగ్ రూల్స్, డాక్యుమెంట్స్ ప్రకారం బిల్డింగ్స్ కట్టారా, లేదా అని రేపు ఫీల్డ్ విచారణ చేపడతామన్నారు.
News March 10, 2026
గుత్తి కోట ఉత్సవాలు ఘనంగా జరపాలి: జేసీ

కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం గుత్తి కోట ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ఈ గుత్తి కోట ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
News March 10, 2026
టెన్త్ పరీక్షల నిర్వహణపై శిక్షణ: డీఈవో

పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో టెన్త్ పరీక్షల నిర్వహణపై వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను వారికి క్షుణ్ణంగా వివరించామన్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.


