News December 1, 2024
BREAKING: ఏఈఈ నికేశ్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్

ఇరిగేషన్ ఏఈఈ నికేశ్ కుమార్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం ఏసీబీ అధికారులు నికేశ్ కుమార్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం నికేశ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 14, 2025
HYDలో ప్రప్రథమ శారీ డ్రాపింగ్ ఈవెంట్.. @మాంగళ్య షాపింగ్ మాల్

భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.
News March 14, 2025
HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
News March 14, 2025
HYD: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI