News December 1, 2024

UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ రాజీనామా.. ఎందుకంటే?

image

UK ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ లూయిస్ హై అనుకోకుండా చేసిన ఓ తప్పిదం తన పదవికి రాజీనామా చేసేలా చేసింది. 11ఏళ్ల క్రితం ఆమె వస్తువులు దొంగతనానికి గురవగా పోలీస్ కంప్లైంట్‌లో మొబైల్ కూడా చేర్చారు. కానీ మొబైల్ ఇంట్లోని కబోర్డులో కనిపించినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. తర్వాత లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను పోలీసులు విచారించారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు.

Similar News

News December 1, 2024

సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్

image

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుభరోసా(రైతుబంధు) కార్యక్రమాన్ని అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం కోరారు.

News December 1, 2024

రేవంత్.. రూ.4వేల పెన్షన్ ఎప్పుడిస్తావ్?: కిషన్‌రెడ్డి

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్‌ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ ‌కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని CM రేవంత్‌ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన HYDలో అన్నారు.

News December 1, 2024

ఇక నుంచి నెలకు రెండుసార్లు!

image

రైళ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకు కనీసం ఒకసారి ఉతికిస్తున్నామని కేంద్ర మంత్రి ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి వ్యతిరేక వ్యక్తం కావడంతో నెలకు రెండుసార్లు దుప్పట్లను ఉతికిస్తామని ఉత్తర రైల్వే ప్రకటించింది. UV రోబోటిక్ శానిటైజేషన్ ద్వారా వాటిని శుభ్రం చేయిస్తామని తెలిపింది. 2010కి ముందు 2-3 నెలలకొకసారి బ్లాంకెట్స్ ఉతికేవారని రైల్వే ప్రతినిధులు ఒకరు అన్నారు.