News December 1, 2024
IT రిటర్నులకు ఈ నెల 15 వరకు గడవు పొడిగింపు
2023-2024కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితోనే గడువుగా ముగియగా పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.
Similar News
News December 1, 2024
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి: YCP MP
AP: ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఢిల్లీ వాతావరణం సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందని వివరించారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో సమావేశాలు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి.
News December 1, 2024
సంక్రాంతి తర్వాత రైతుభరోసా: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుభరోసా(రైతుబంధు) కార్యక్రమాన్ని అమలు చేస్తామని, సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు. విధివిధానాలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం కోరారు.
News December 1, 2024
రేవంత్.. రూ.4వేల పెన్షన్ ఎప్పుడిస్తావ్?: కిషన్‌రెడ్డి
TG: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2వేల పెన్షన్‌ను రూ.4వేలు చేస్తామని హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రూ.4వేల పెన్షన్, ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఎప్పుడిస్తావని CM రేవంత్‌ను ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే స్థితిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆయన HYDలో అన్నారు.