News December 1, 2024
నెటిజన్లకు క్రికెటర్ ప్రశ్న.. సమాధానం తెలుసా?

బ్రిటిష్ క్రికెటర్ అలాన్ విల్కిన్స్ నెటిజన్ల మెదడుకు పనిచెప్పారు. టెస్టు క్రికెట్‌లో కేవలం ఐదుగురికే సాధ్యమైన ఓ రికార్డు గురించి ఆయన ప్రశ్నించారు. ‘టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీసం పది టెస్ట్ సెంచరీలు పూర్తిచేసి, 150+వికెట్లు పడగొట్టి 3,000+ రన్స్ చేసిన రికార్డు ఐదుగురిపైనే ఉంది. వారెవరో చెప్పగలరా?’ అని ఆయన ప్రశ్నించారు. అందులో రవి శాస్త్రి, బెన్ స్టోక్స్‌లు ఉండగా మరో ముగ్గురి పేర్లు గెస్ చేయండి.
Similar News
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం
News March 12, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 12, 2026
అలా అయితేనే యుద్ధం ముగుస్తుంది: ఇరాన్ అధ్యక్షుడు

రష్యా, పాక్ లీడర్లతో యుద్ధ పరిస్థితులపై చర్చించినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెల్లడించారు. ప్రాంతీయ శాంతిని నెలకొల్పడానికి ఇరాన్ కట్టుబడి ఉందన్నారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పెట్టిన షరతులకు US, ఇజ్రాయెల్ అంగీకరించాలన్నారు. ‘అంతర్జాతీయంగా ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దాడులు జరగవని హామీ ఇవ్వాలి’ అని Xలో పోస్ట్ చేశారు.


