News December 1, 2024

అభిమాని ఆత్మహత్య.. మంత్రి లోకేశ్ ఎమోషనల్

image

AP: ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను అనే TDP అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేశ్ ఎమోషనల్ పోస్టు చేశారు. ‘ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా బర్త్‌డే, పెళ్లి రోజులను పండుగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఓ మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని తప్పుచేశావ్ తమ్ముడు. ఓ అన్నగా మీ కుటుంబానికి అండగా ఉంటా’ అని రాసుకొచ్చారు.

Similar News

News March 16, 2026

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్‌ ఖాన్‌‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

News March 16, 2026

ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్‌స్టార్
* సిన్నర్స్- జియో హాట్‌స్టార్
* ఫ్రాంకెన్‌స్టైన్- నెట్‌ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్‌ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్‌స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ

News March 16, 2026

‘స్వప్నం’ నెరవేర్చుకుంది.. 2 నెలల్లో 5 బ్యాంకు ఉద్యోగాలు

image

AP: బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తన లక్ష్యానికి పెళ్లి అడ్డుకాదని నిరూపించారు విశాఖకు చెందిన స్వప్న. డిగ్రీ వరకు చదివిన ఈమె వివాహం తర్వాత శ్రీకాకుళం(D) జొన్నలపాడులో అత్తగారింట్లో పట్టుదలతో చదివారు. 2 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. JAN 15న IBPS PO, FEB 23న RBO PO, FEB 27న SBI జూనియర్ అసోసియేట్, మార్చి 2న BOBలో క్లర్క్, మార్చి 15న APGBలో క్లర్కు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.