News December 1, 2024

IPLకు విజయ్.. టెక్కలిలో అభినందనలు ఫ్లెక్సీ

image

టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్- ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎంపిక కావడం పట్ల టెక్కలిలో విజయ్ స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రౌండ్ ప్లేయర్స్ విజయ్‌కు అభినందనలు తెలుపుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం రోడ్డులో ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొట్టమొదటి యువకుడు త్రిపురాన విజయ్‌కు “All The Best” చెప్తూ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.

Similar News

News March 14, 2026

శ్రీకాకుళం: ఫోటోల అశ్లీల మార్ఫింగ్‌ చేసిన విద్యార్థిపై కేసు

image

శ్రీకాకుళం రూరల్ పరిధి మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినిల ఫోటోల అశ్లీల మార్ఫింగ్ అంశంలో అసలెంత మంది పాత్ర ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

News March 14, 2026

శ్రీకాకుళం: టెన్త్ పరీక్షా కేంద్రం తెలుసుకోవాలా..QR కోడ్ మీ కోసమే

image

​పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాకుళం DEO ఎ. రవిబాబు శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.

News March 14, 2026

ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

image

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.