News December 1, 2024

ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది..?: హరీశ్ రావు

image

ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది.? అని ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

Similar News

News March 14, 2026

మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 14, 2026

మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి: మంత్రి దామోదర

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ హాస్పిటల్‌లో ‘షి పవర్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విమెన్స్ కాంక్లేవ్’లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షి పవర్ మొబైల్ యాప్’ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారతపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ రంగాల మహిళా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

News March 14, 2026

మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

image

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.