News December 1, 2024

ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా: జైషా

image

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ పదవిని చేపట్టడం గర్వంగా భావిస్తున్నట్లు జైషా తెలిపారు. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై దృష్టి సారిస్తానని, మహిళల క్రికెట్‌ను డెవలప్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఆయన బీసీసీఐ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.

Similar News

News March 6, 2026

యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

image

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.

News March 6, 2026

బెంబేలెత్తించిన బెథెల్

image

T20WC: సెమీఫైనల్లో భారత్ గెలిచినా ఇంగ్లండ్ బ్యాటర్ బెథెల్ మనసులు గెలిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన దూకుడును ఎక్కడా తగ్గించలేదు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు కొడుతూ భారత ఆటగాళ్లను, అభిమానులను వణికించారు. 48 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 రన్స్ చేశారు. బెథెల్ గ్రేట్ ఇన్నింగ్స్ ఆడారంటూ టీమ్ ఇండియా ఫ్యాన్స్ సైతం ప్రశంసిస్తున్నారు.

News March 6, 2026

తెలంగాణకు కొత్త గవర్నర్

image

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.