News December 1, 2024

అప్పుడే ఓపెనర్స్ అని నిర్ణయించేశారుగా!

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషీన్ విరాట్ కోహ్లీల, స్టార్ పేసర్‌ల కుమారులకూ ఫ్యాన్స్ ఆర్మీలు పుట్టుకొస్తున్నాయి. హిట్ మ్యాన్ కొడుకు అహాన్‌, కోహ్లీ కుమారుడు అకాయ్‌, అంగద్ బుమ్రాలు టీమ్ఇండియాకు ఆడతారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్ వరల్డ్ కప్‌లలో అకాయ్, అహాన్‌లు ఓపెనర్స్‌గా, అంగద్ బౌలర్‌గా ఆడతారంటున్నారు. దీంతో అప్పుడే నిర్ణయించేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News April 2, 2026

ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

image

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే

News April 2, 2026

పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఆపేశాం.. లేదంటేనా: నేవీ చీఫ్

image

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ పాత్రపై చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరికొన్ని నిమిషాల్లో నేవీ పాక్ తీరప్రాంతంపై భారీ దాడులతో విరుచుకుపడనుందనగా ఆ దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. వెంటనే దాడులు ఆపాలని వేడుకోవడంతో వ్యూహాలను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో సేవలకుగాను నేవీ అధికారులకు యుద్ధ్ సేవా మెడల్స్ ప్రదానం సందర్భంగా చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 2, 2026

చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

image

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్‌చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్‌‌ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్‌లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.