News December 1, 2024
‘పుష్ప-2’ ఈవెంట్.. పోలీసుల కీలక నిర్ణయం?

రేపు యూసుఫ్‌గూడ గ్రౌండ్‌లో జరిగే ‘పుష్ప-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 600+ మంది పోలీసులను రంగంలోకి దింపారు. ఇదే గ్రౌండ్‌లో గతంలో అల వైకుంఠపురములో, పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్‌లు జరగ్గా.. భారీగా జనం తరలిరావడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో పరిమిత సంఖ్యలో బార్ కోడ్ కలిగిన ఈవెంట్ పాస్ ఉంటేనే అనుమతి ఇస్తారని సినీవర్గాల సమాచారం.
Similar News
News November 13, 2025
భార్యను హతమార్చిన భర్త

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65 సమాధానాలు

ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
శంతనుడు, గంగాదేవి ఎనిమిదవ కుమారుడు ‘దేవవత్రుడు’. హస్తినాపురానికి రాజుగా కాబోనని, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆయనకు ‘భీష్ముడు’ అనే పేరు వచ్చింది. శంతనుడి సంతోషం కోసం, తన తండ్రి పెళ్లి చేసుకొనే సత్యవతి పుత్రులకు రాజ్యాధికారం దక్కాలని భీష్ముడు ఈ ప్రతిజ్ఞ చేశాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 13, 2025
కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.


