News December 1, 2024
దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జట్టు ఎంపిక

గాజువాక జింక్ మైదానంలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి పది టీములు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
Similar News
News July 10, 2025
విశాఖ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కంచరపాలెం సమీపంలోని NCC రైల్వే యార్డ్ వద్ద జరిగింది. స్థానికుల సమాచారంతో GRP ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు సమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. అతని ఐడెంటిటికీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, మృతదేహాన్ని KGHకి తరలించామన్నారు. పై ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.
News July 10, 2025
రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విశాఖ రానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళ్తారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి విశాఖలో బస చేస్తారు. శనివారం పార్వతీపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని శనివారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.