News December 1, 2024
‘సయ్యద్ మోదీ’ టైటిల్ గెలుచుకున్న పీవీ సింధు

తెలుగు తేజం పీవీ సింధు ‘సయ్యద్ మోదీ’ టోర్నీ టైటిల్‌ని కైవసం చేసుకున్నారు. ఫైనల్‌లో చైనాకు చెందిన వు లువో యుపై 21-14, 21-16 తేడాతో వరుస సెట్లలో ఆమె విజయం సాధించారు. ఇది సింధుకు మూడో ‘సయ్యద్ మోదీ’ టోర్నీ టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2022 సంవత్సరాల్లో ఆమె ఈ టైటిల్‌ని గెలిచారు. గత ఏడాది గాయం కారణంగా ఆడలేదు.
Similar News
News March 12, 2026
‘జాబ్ క్యాలెండర్’పై రేపు కీలక భేటీ

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖలవారీగా ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. రేపు అన్ని విభాగాధిపతులతో కీలక భేటీ నిర్వహించనుంది. ఆ తర్వాత ఖాళీలపై తుది జాబితాను రూపొందించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
News March 12, 2026
‘స్వర్ణ’ ఆఫీసుల్లో తరచూ తనిఖీలు

AP: స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డుల పనితీరు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కలెక్టర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు 8 కేటగిరీల అధికారులు నెలలో 3-12 సార్లు ఆ కార్యాలయాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అందుతున్న సేవలు, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించాలని సూచించింది. సిబ్బంది పనితీరు, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టిసారించాలంది.
News March 12, 2026
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 10వ తేదీలోపే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీన రిజల్ట్స్ ప్రకటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వాల్యుయేషన్ ఆలస్యమైతే మరో 2-3 రోజులు పట్టే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్రంలో FEB 25న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 18తో ముగియనున్నాయి. కాగా ఈనెల 4 నుంచే వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది.


