News December 1, 2024

ఇండియా కూట‌మి నుంచి ఆప్ ఔట్‌?

image

ఢిల్లీలో ఒంట‌రి పోరుకు సిద్ధపడి కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ షాక్ ఇచ్చారు. 2020లో 70 సీట్ల‌లో ఒక్క‌టీ గెల‌వ‌ని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవ‌డంపై పెట్టుకున్న ఆశ‌లు గల్లంతయ్యాయి. లోక్‌స‌భ పోల్స్‌లో ఢిల్లీ, హరియాణాలో క‌లిసి పోటీ చేసినా పంజాబ్‌లో ఒంట‌రిగా బ‌రిలో దిగాయి. హ‌రియాణా అసెంబ్లీ పోల్స్‌లోనూ పొత్తు కుద‌ర‌లేదు. ఢిల్లీలోనూ కుదరదని చెప్పిన ఆప్ INDIA కూట‌మికి దూర‌మ‌వుతోంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Similar News

News January 5, 2026

శివ మానస పూజ ఎలా చేయాలి?

image

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.

News January 5, 2026

కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

image

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.

News January 5, 2026

కోమా నుంచి బయటపడ్డ మార్టిన్

image

కోమాలోకి వెళ్లిన AUS మాజీ క్రికెటర్ <<18721780>>మార్టిన్<<>> అందులో నుంచి బయటపడ్డారని మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ వెల్లడించారు. ‘గత 48 గంటల్లో అద్భుతం జరిగింది. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడు. మాట్లాడగలుగుతున్నాడు. అతడిని ICU నుంచి వేరే వార్డుకి మార్చవచ్చు. ఇది ఒక పాజిటివ్ విషయం. అతడికి ఇంకొంతకాలం ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. మార్టిన్ Meningitis అనే వ్యాధితో బాధపడుతున్నారు.