News December 1, 2024
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి పొన్నం

TG: అధికారంలోకి వచ్చాక చేపట్టిన ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన GHMC ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Similar News
News January 15, 2026
ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన హీరోయిన్ సాయిపల్లవి నటిస్తున్నారు. ‘ఏక్ దిన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు టీజర్ రిలీజ్ కానుంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఆమిర్ ఖాన్ ఓ నిర్మాతగా ఉన్నారు. కాగా సాయిపల్లవి రణ్‌బీర్ ‘రామాయణ’లోనూ నటిస్తుండగా ఈ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది.
News January 15, 2026
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

<


