News December 1, 2024

HYD: శ్రీనివాస పద్మావతి అమ్మవారికి పద్మశాలిల చీర, సారె

image

తిరుమల, తిరుపతి దేవస్థానం, తిరుచానూర్‌లోని శ్రీనివాస పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొని అమ్మవారికి చీర,సారెను అందజేశారు. పద్మావతి అమ్మవారిని పద్మశాలి ఆడపడుచుగా భావించి తల్లిగారి తరపున చీర, సారెను అందజేసినట్లు అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్యంతల తెలిపారు.

Similar News

News March 18, 2026

మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

image

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.