News December 1, 2024
Dec 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TG: డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో దాని విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న, అమలు చేయాల్సిన పలు సంక్షేమ పథకాలపై చర్చించే ఛాన్స్ ఉంది.
Similar News
News March 14, 2025
WPL: ఫైనల్లో ముంబై

గుజరాత్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI ముందుగా బ్యాటింగ్ చేయగా మాథ్యూస్(77), స్కివర్ బ్రంట్(77) విధ్వంసంతో 213 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గిబ్సన్(34)దే అత్యధిక స్కోరు. దీంతో ముంబై ఫైనల్ చేరింది. ఈ నెల 15న ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
News March 14, 2025
హోలీ.. రేపు ‘బ్లడ్ మూన్’

రంగుల పండుగ హోలీ వేళ రేపు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా భూమి వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి సూర్యకిరణాలు ప్రసరించి జాబిల్లి ఎర్రగా మారనుంది. దీన్నే ‘బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. కానీ ఇది భారత్‌లో కనిపించదు. యూరప్ దేశాలతో పాటు సౌత్, నార్త్ అమెరికా, వెస్ట్రన్ ఆఫ్రికా దేశాల్లో బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.
News March 14, 2025
నియోజకవర్గాల పునర్విభజనపై పోరుకు సిద్ధం: KTR

TG: నియోజకవర్గాల పునర్విభజనపై TN CM స్టాలిన్ తలపెట్టిన JACతో కలిసి పోరాడుతామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సమావేశానికి రావాల్సిందిగా TN మంత్రి నెహ్రూ, DMK MP ఇలంగో HYD వచ్చి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. 22న జరిగే సమావేశానికి హాజరవుతామని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలన్నారు.