News December 1, 2024

వేమవరం వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

image

బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం వద్ద వీరి బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఖాన్సా (13 నెలలు) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

Similar News

News November 6, 2025

ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ఒంగోలు: 10 నుంచి అసెస్మెంట్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9:15 గంటల నుంచి 12.35గంటల వరకు.. 6, 7వ తరగతి విద్యార్థులకు 1.15 గంటల నుంచి 4.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

News November 6, 2025

మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇలా..!

image

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి రెవెన్యూ జిల్లాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపేలా ప్రతిపాదించారు. మర్రిపూడి, పొన్నలూరు, కొండపి, జరుగుమిల్లి, సింగరాయకొండ, టంగుటూరును కందుకూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. ముండ్లమూరు, తాళ్లూరు, అద్దంకి నియోజకవర్గంలోని అన్ని మండలాలు కలిపి అద్దంకి డివిజన్‌గా ఏర్పాటు కానుంది. డిసెంబర్ నెలాఖారు లోపల ఈ ప్రక్రియ పూర్తి కానుంది.