News December 1, 2024

CM రేవంత్‌కు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సవాల్

image

TG: మాజీ సీఎం KCRకు వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని CM రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను BRS మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖండించారు. KCRకు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు తేలితే తాను MLA పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. తనతో వస్తే KCR ఫామ్‌హౌస్ చూపిస్తానని రేవంత్‌కు ప్రశాంత్‌రెడ్డి ఆఫర్ చేశారు.

Similar News

News March 7, 2026

త్వరలో ఎన్నికలు.. నిరుద్యోగులకు ₹1,500

image

త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ WB CM మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పారు. 10వ తరగతి పాసై ఖాళీగా ఉన్న 21 నుంచి 40 ఏళ్ల లోపు యువతీ యువకులకు నెలకు ₹1,500 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. మార్చి 7 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు కోటి మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 40% తగ్గిందని, లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.

News March 7, 2026

క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు: CM

image

AP: క్వాంటం కంప్యూటింగ్, AIలకు ప్రపంచ కేంద్రంగా ఎదగాలనేదే ఏపీ లక్ష్యమని CM చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్, AI కోసం $15Bn ఇన్వెస్ట్ చేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన అంశంపై ఆయన మాట్లాడారు. ‘అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు వస్తాయి. భవిష్యత్తులో ప్రజలు క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు’ అని పేర్కొన్నారు.

News March 7, 2026

భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువ: శాంట్నర్

image

T20 WC ఫైనల్‌కి ముందు కివీస్ కెప్టెన్ శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత ఫ్యాన్స్ ముందు ఆడుతున్న భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది భారత అభిమానుల హృదయాలను ముక్కలు చేసి, స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చి కప్ గెలవడమే తమ లక్ష్యమన్నారు. టీమ్‌ఇండియా బ్యాటర్లను కట్టడి చేయాలంటే ఆరంభంలోనే వికెట్లు తీయడం కీలకమని, బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఛాలెంజ్ అని విశ్లేషించారు.