News December 1, 2024

అలా అయితే దేశం వృద్ధి చెందదు: రాహుల్

image

ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌యోజ‌నాలు కొద్ది మంది బిలియ‌నీర్ల‌కే దక్కినంత కాలం దేశం వృద్ధి చెందదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పేద‌ల ఆర్థిక సమస్యలు పరిష్కారమైతేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 14 నెల‌ల క‌నిష్ఠానికి, GDP వృద్ధి రెండేళ్ల క‌నిష్ఠ స్థాయి 5.4 శాతానికి ప‌డిపోవ‌డం ఆందోళ‌న‌క‌ర‌మ‌న్నారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాల‌తో ఆర్థిక వ్య‌వస్థ‌కు కొత్త ఆలోచ‌న‌లు అవ‌స‌ర‌మ‌న్నారు.

Similar News

News March 28, 2026

ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

image

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.

News March 28, 2026

పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

image

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.

News March 28, 2026

ఆలివ్ ఆయిల్‌ వాడటం వల్ల కలిగే లాభాలు

image

వంటల్లో ఆలివ్ ఆయిల్ చేర్చడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఆలివ్స్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు మేలుచేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు, ఫైబర్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌, రక్తపోటును తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యంతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సాయపడతాయని పలు సర్వేలు తేల్చాయి. జీర్ణ వ్యవస్థతోపాటు చర్మ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి.