News December 2, 2024
పెద్దమండెం: రైతుపై హత్యాయత్నం

రైతుపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆదివారం పెద్దమడెం మండలంలో చోటుచేసుకుంది. SI రమణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండమీదపల్లికి చెందిన లక్ష్మీనారాయణ(55) పొలంలో వేరే పొలానికి చెందిన వెంకటరమణ పాడి పశువులు పంట నష్టం చేశాయని ఇటీవల మందలించాడు. దీంతో కసి పెంచుకొన్న వెంకటరమణ తన అనుచరులతో దారికాసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
Similar News
News March 15, 2026
చిత్తూరు: ‘గ్యాస్ కష్టాలు ఉంటే కాల్ చేయండి’

జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) 08572-242734 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
News March 15, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.182 నుంచి రూ.186, మాంసం రూ.264 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 15, 2026
చిత్తూరు: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ మెసేజ్‌లను నమ్మొద్దని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బిల్లు బకాయి ఉందని, కట్ట కుంటే సరఫరాను ఆపివేయనున్నట్లు, మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ కొందరు వినియోగదారులకు సందేశాలు అందుతున్నట్లు తెలిసిందన్నారు. ఎటువంటి వివరాలైన APSPDCL అధికారిక వర్గాల ద్వారా తెలియజేస్తామన్నారు.


