News December 2, 2024

5వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో భారత్ ఎలా గెలిచింది?

image

AUS PM XIతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయినా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 5 వికెట్ల తేడా కదా? అనే సందేహం చాలామందికి వచ్చింది. అయితే 46ఓవర్ల మ్యాచ్‌లో మొదట PM XI 43.2 ఓవర్లలో 240/10 స్కోర్ చేసింది. భారత్ 42.5 ఓవర్లలోనే 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో గెలిచాక కూడా 46ఓవర్లు పూర్తిగా ఆడింది. లక్ష్యాన్ని ఛేదించాక మరో వికెట్ కోల్పోయింది.

Similar News

News March 25, 2026

86 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి కాంట్రాక్ట్ పద్ధతిలో 86 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ, BE/BTech,ME/ఎంటెక్‌/Msc,MA/ఎంఈడీ/Phdతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో 06.04.26, ఆఫ్‌లైన్‌లో 16.04.26 వరకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.nitt.edu చూడండి.

క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలు శిక్ష!

image

కొరత భయంతో చాలా మంది ఇళ్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. అయితే పెట్రోలియం చట్టం-1934 ప్రకారం క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం నేరం. తొలిసారి చిక్కితే ₹వెయ్యి ఫైన్/ నెల జైలు శిక్ష.. రెండోసారి ₹5వేలు ఫైన్‌, 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బంక్ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ నిల్వ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు. SHARE IT