News December 2, 2024

మధిరలో ప్రజా విజయోత్సవాలు: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలలో భాగంగా నేడు మధిరలోని రెడ్డి రెడ్డి గార్డెన్స్‌లో సాంస్కృతిక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

ఖమ్మం: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్–2025-26ను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం విడుదల చేశారు. బ్యాంకు అనుసంధానంతో ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ పథకాలకు దరఖాస్తులు కోరారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు.

News March 13, 2026

వంట గ్యాస్‌కు కొరత లేదు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో గృహావసరాల వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షించారు. కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రధాన కాలువకు భూసేకరణ ముగించి, మిగిలిన అటవీ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.