News December 2, 2024

విశాఖలో తందూరీ టీ చేసిన హోంమంత్రి

image

హోంమంత్రి వంగలపూడి అనిత ఎంవీపీ కాలనీలో ఆదివారం ‘టీ’ కాచారు. ఓ టీ స్టాల్ వద్ద షాప్ వద్ద పలువురితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే ‘టీ’ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం హోంమంత్రి అనిత స్వయంగా ‘తందూరీ టీ’ని తయారు చేసి తాగారు.

Similar News

News July 10, 2025

రేపు విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

image

రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం విశాఖ రానున్నారు. రేపు ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కు వెళ్తారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి విశాఖలో బస చేస్తారు. శనివారం పార్వతీపురంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని శనివారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.

News July 10, 2025

సత్యసాయి భక్తులు గ్రేట్…!

image

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.

News July 9, 2025

గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

image

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.