News December 2, 2024
రాజకీయ దురంధరుడు.. మర్రి చెన్నారెడ్డి..!

ఉమ్మడి AP మాజీ CM మర్రి చెన్నారెడ్డి వర్ధంతి నేడు. 1919 జనవరి 13న వికారాబాద్ జిల్లాలోని సిరిపురంలో ఆయన జన్మించారు. 1953లో వికారాబాద్ MLAగా గెలిచి 27 ఏళ్ల వయసులోనే మంత్రి అయ్యారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అవతరణను ఆయన గట్టిగా వ్యతిరేకించారు. 1978లో మేడ్చల్ నుంచి పోటీ చేసి CMగా బాధ్యతలు చేపట్టారు. మరోసారి 1989లోనూ CM పీఠం అధిరోహించారు. 1996 డిసెంబర్ 2న తమిళనాడు గవర్నర్‌గా ఉండగానే కన్నుమూశారు.
Similar News
News March 14, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంల హోలి విషెస్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని రేవంత్ అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు జరుపుకునే ఈ పండుగ సమైక్యతకు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో కొత్త రంగులు నింపాలని CBN ఆకాంక్షించారు. రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించవద్దని సూచించారు.
News March 14, 2025
కాల్పుల విరమణకు పుతిన్ ఒకే.. కానీ

ఉక్రెయిన్‌తో యుద్ధంలో 30 రోజుల పాటు <<15729985>>కాల్పుల విరమణకు<<>> రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. కాల్పుల విరమణకు అనుకూలమేనని అంటూ చిన్నచిన్న విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మధ్యవర్తిత్వం చేస్తున్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి మాట్లాడుతామని చెప్పారు. ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా ముగించే ఆలోచనకు మద్దతిస్తామని పేర్కొన్నారు.
News March 14, 2025
హోలి: ఈ జాగ్రత్తలు పాటించండి

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.