News December 2, 2024

సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!

image

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 21, 2026

అనంత జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో వినిపించేలా చేశారు: MLA

image

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి వివిధ రంగాల్లో రాణిస్తూ అనంతపురం జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేశారని పురస్కారాల గ్రహీతలను అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఇందులో అనంతపురం జిల్లా నుంచి ముగ్గరికి స్థానం లభించింది.

News March 21, 2026

అనంత: టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్

image

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను ‘Missile Woman of India’గా పిలవబడే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఆమె గతంలో అగ్ని-IV, అగ్ని-V క్షిపణులకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశంలోని క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె కావడం విశేషం.

News March 21, 2026

ముస్లింలు ఆర్థికంగా ఎదగాలి: అనంతపురం ఎంపీ

image

అనంతపురం అశోక్ నగర్ ఈద్గా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా విద్యావంతులై, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.