News December 2, 2024
గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!

సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Similar News
News January 13, 2026
మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.
News January 13, 2026
MDK: ఆపరేషన్ స్మైల్.. అమ్మనాన్న మీ దగ్గరికి వచ్చేశా!

రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా మెదక్ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమష్టి కృషి జరుగుతోందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. 10 రోజుల్లో 26 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించగా, 9 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 28 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News January 13, 2026
మెదక్: మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. వార్డులు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, వార్డుల వారీగా ఓటర్ లిస్టులు, ఆర్వోలు, ఇతర ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలన్నారు.


