News December 2, 2024
బల్లికురవ: ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం
13 నెలల చిన్నారి ఖాన్సాకు తల్లిదండ్రులు ఎటువంటి కష్టం రాకుండా పెంచుకున్నారు. చిన్నపాటి అనారోగ్యంగా ఉండటంతో చిలకలూరిపేట ఆసుపత్రిలో చూపించుకున్నారు. తిరిగి వస్తుండగా గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తమ కళ్లెదుటే, చేతుల్లోనే చిన్నారి మృతి చెందడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన బల్లికురవ మండలంలోని వేమవరంలో ఆదివారం జరిగింది. వీరిది సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామం.
Similar News
News December 26, 2024
ప్రకాశం: జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా పేరయ్య
జిల్లా మత్స్యకార సహకార సంఘానికి ఎన్నికలు గురువారం మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షునిగా గొల్లపోతు పేరయ్య, వైస్ ప్రెసిడెంట్‌గా కావేరి. రాములు, మరో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన పేరయ్యకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
ప్రకాశం: 6,481 హెక్టార్లలో పంట నష్టం
ఈ నెల 24 నుంచి 26 వరకు ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బ తిన్నాయి. జిల్లాలో మొత్తం 6,481 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News December 26, 2024
శానంపూడిలో యువతి ఆత్మహత్య
సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.