News December 2, 2024
2 కేసుల్లో కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రకటించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో డెలావెర్, కాలిఫోర్నియాలో అతనిపై కేసులున్నాయి. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, కానీ రాజకీయాల ప్రభావంతో న్యాయం తప్పుదోవ పడుతోందన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 13, 2025
8 ఏళ్లలోపు పిల్లలు ఈ ఐస్‌క్రీమ్ తినొద్దు: UK సైంటిస్టులు

రంగులు కలిపే ముద్ద ఐస్‌లను పిల్లలు ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. అయితే, గ్లిజరాల్ కలిగిన ఈ స్లష్ ఐస్‌ను 8ఏళ్ల లోపు చిన్నారులు తినడం ప్రమాదకరమని UK పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో పిల్లలు స్లషీ ఐస్ సేవించిన వెంటనే అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చిందని తెలిపారు. గ్లిజరాల్ వల్ల పిల్లలు స్పృహ కోల్పోతున్నారన్నారు. 8-11ఏళ్లలోపు పిల్లలు ఎప్పుడైనా ఒకటి తినొచ్చని సూచించారు.
News March 13, 2025
రేపు వైన్స్ బంద్

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.