News December 2, 2024

అమ్మానాన్నా క్షమించండి.. సెల్ఫీ వీడియో తీసి యువతి ఆత్మహత్య

image

TG: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన అమ్మాయి కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో జరిగింది. ‘అమ్మానాన్నా నన్ను క్షమించండి. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆయన వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నా. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి’ అని సెల్ఫీ వీడియో తీసి ఉరేసుకుంది. నరేందర్, దీప్తి 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కాగా తమ బిడ్డను నరేందరే చంపాడని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.

Similar News

News February 3, 2026

ఇది ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ: రాహుల్ గాంధీ

image

ఉద్దేశపూర్వకంగానే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశ భద్రత ముఖ్యమైన అంశమని, దీనిపై సభలో మాట్లాడనివ్వకుండా హక్కులను కాలరాశారని విమర్శించారు. ఓ ప్రతిపక్ష నేతకు ఇలా జరగడం పార్లమెంటు చరిత్రలో తొలిసారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంపై ఒక మాయని మచ్చ అని లేఖలో పేర్కొన్నారు.

News February 3, 2026

ఏప్రిల్ 3న శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్

image

శర్వానంద్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్‌లో UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్. ఇప్పటికే రిలీజైన ‘ఫస్ట్ ల్యాప్’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. జిబ్రాన్ మ్యూజిక్ ఈ రేసింగ్ థ్రిల్లర్‌కు స్పెషల్ అట్రాక్షన్.

News February 3, 2026

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

image

TG: జగిత్యాల(D) మొగిలిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు రైతు కూలీలు స్పాట్‌లోనే చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు మెట్‌పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.