News December 2, 2024
పాక్‌లో ‘టెర్రర్’.. నవంబర్‌లో 245 మంది మృతి

ఆత్మాహుతి, ఉగ్రదాడులతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. NOVలో జరిగిన 71 దాడుల్లో 245మంది మృత్యువాతపడ్డారు. ఈ సంఖ్య ఈ ఏడాదిలో రెండో అత్యధికం. వీరిలో 127మంది టెర్రరిస్టులు, 68మంది భద్రతా సిబ్బంది, 50మంది పౌరులు ఉన్నారని PICSS వెల్లడించింది. మరో 257మంది గాయపడ్డారని తెలిపింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోనే ఎక్కువగా పేలుడులు సంభవించినట్లు పేర్కొంది. AUGలో అత్యధికంగా 254మంది మరణించినట్లు తెలిపింది.
Similar News
News November 15, 2025
CSK కెప్టెన్‌గా సంజూ శాంసన్?

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్ రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ధోనీ తర్వాత జట్టు పగ్గాలు ఎవరికన్న ప్రశ్నకు సమాధానంగానే సంజూను జట్టులోకి తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ధోనీ నుంచి రుతురాజ్‌కు ఆ బాధ్యతలిచ్చారు. మళ్లీ MSDనే కెప్టెన్ చేశారు. అయితే ఈ సమస్యకు సంజూనే శాశ్వత పరిష్కారమని విశ్లేషకులూ భావిస్తున్నారు. అటు జట్టు భవిష్యత్తు కోసం జడేజానూ CSK త్యాగం చేసిందంటున్నారు.
News November 15, 2025
అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 15, 2025
179 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<


