News December 2, 2024

నేడు సీఎంతో పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మధ్యాహ్నం భేటీ కానున్నారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటు, బియ్యం అక్రమ రవాణా, అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించిన పవన్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 6, 2026

నీటి భద్రతే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

100 రోజుల యాక్షన్ ప్లాన్‌తో నీటిని సంరక్షిస్తామని యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో CM చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో గతంలో 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి హార్టికల్చర్ హబ్‍గా మార్చామని గుర్తుచేశారు. భూగర్భజలాలు 1.92 మీటర్లు పెరిగాయని, మైక్రో ఇరిగేషన్ అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

News April 6, 2026

గ్యాస్ కొరతపై రాహుల్ ఫైర్

image

వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని మోదీ ప్రభుత్వం ఎలాగైతే గాలికొదిలేసిందో ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్నీ అలాగే హ్యాండిల్ చేస్తోందన్నారు. ప్రకటనలకే పరిమితమవుతూ పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. రోజూ ₹500-800 సంపాదించే కూలీలకు గ్యాస్ అందనంత దూరమైందన్నారు. దీనివల్ల కార్మికులు నగరాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారని, పరిశ్రమలు నష్టపోతున్నాయన్నారు.

News April 6, 2026

ప్చ్.. ఇంకా IPL ఆడాల్సింది: అశ్విన్

image

IPLలో వరుసగా 3 మ్యాచుల్లో CSK ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశారు. గత సీజన్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని వాపోయారు. జట్టుపై నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, లేదంటే ఈ సీజన్ కూడా ఆడేవాడినని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలగొద్దని, తన వల్ల ఫ్రాంచైజీకి ₹10 కోట్లు మిగులుతాయనే భావించానన్నారు. మానసిక అలసట వల్లే గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని వివరించారు.