News December 2, 2024
ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 15, 2026
కడప: 10th పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
News March 15, 2026
ఆందోళనలో కడప జిల్లా 10th విద్యార్థులు..!

కడప జిల్లాలో రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలు ఒకే చోట నిర్వహిస్తుండడంతో రెగ్యులర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ 10th పరీక్షలకు 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే 31 చోట్ల ఓపెన్ 10th సెంటర్లు ఏర్పాటు చేశారు. రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలు పక్కపక్క గదుల్లోనే జరగనున్నాయి. చూచిరాతల ఓపెన్ పరీక్షలతో, చదివిరాసే రెగ్యులర్ విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు.
News March 15, 2026
కడప జిల్లా వ్యాప్తంగా 282 కేసులు

కడప జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనల పాటించని 282 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి రూ.58,340లు జరిమానాగా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు తెలిపారు.


