News December 2, 2024

విద్యుత్ అంతరాయం ఉండొద్దు: మంత్రి గొట్టిపాటి

image

AP: తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గేవరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మధ్యాహ్నానికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు.

Similar News

News March 12, 2026

సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.

News March 12, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

image

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్‌ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం

News March 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.