News December 2, 2024

పరువు హత్య.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!

image

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు.

Similar News

News March 22, 2026

ఆయిల్ పామ్ అంటే?

image

‘ఆయిల్ పామ్’ అనేది వంట నూనె అవసరాల కోసం సాగు చేసే వాణిజ్య పంట. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇస్తుంది. దీని పండ్ల గుజ్జు నుంచి పామాయిల్, గింజల నుంచి పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. మొక్క నాటిన 3-4 ఏళ్ల నుంచి దిగుబడి మొదలై 25-30 ఏళ్ల వరకు లాభాలిస్తుంది. దీని సాగుకు సమృద్ధిగా నీరు, 21°C-32°C మధ్య ఉష్ణోగ్రత అవసరం. అంతర పంటలకు అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వాల రాయితీ రైతుకు మేలు చేస్తుంది.

News March 22, 2026

వారంలో 10% తగ్గిన బంగారం ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.

News March 22, 2026

రేపే మిట్టల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు CM చంద్రబాబు రేపు శంకుస్థాపన చేస్తారు. రూ.1,47,162CR పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 60-65వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశలో 7.3MT, రెండో దశలో 10.5MT ఉత్పత్తి.. 2033 నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.