News December 2, 2024
ప్రపంచ మేధావుల సరసన 10 ఏళ్ల బాలుడు

లండన్‌లో నివసించే భారతీయ మూలాలున్న 10ఏళ్ల క్రిష్ అరోరా IQలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్‌ను దాటేశాడు. పియానో వాయించడంలో గ్రేడ్ 7 సర్టిఫికెట్ సాధించిన అతను, చెస్ కూడా బాగా ఆడగలడు. మానవ మేధస్సును కొలిచే ఐక్యూ(intelligence quotient)లో 162 సాధించి ఔరా అనిపించాడు. దీంతో ప్రపంచంలోని అత్యంత మేధావులైన 1శాతం మందిలో క్రిష్ నిలిచాడు. అటు, ఐన్‌స్టీన్ IQ 160గా చెబుతుంటారు.
Similar News
News March 16, 2026
‘పద్మ వ్యూహం’ నిర్మాణం ఎలా ఉంటుందంటే?

బయటపడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ‘పద్మవ్యూహం’లో ఇరుక్కుపోయారని అంటారు. భారతంలో ద్రోణాచార్యుడు పన్నిన శత్రు దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణమే పద్మవ్యూహం. తామరపువ్వు ఆకారంలో 7 వలయాల్లో రథ, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో ఉంటుంది. ఇందులోకి వెళ్లిన అభిమన్యుడు తనువు చాలించారు. దీన్ని ఛేదించగలిగేది కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మాత్రమే.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 16, 2026
నోటీసుల డ్రామా వద్దు.. MPతో రాజీనామా చేయించండి: YCP

AP: డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన MP మహేశ్‌కు బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని CM CBNపై YCP ధ్వజమెత్తింది. ‘మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి MLAలు శ్రీధర్, ఆదిమూలం, రవికుమార్, అహ్మద్, మంత్రి సంధ్యారాణి PAపై చర్యలు లేవు. ఫొటోలతో అడ్డంగా దొరికిన TTD ఛైర్మన్‌పైనా నో యాక్షన్. MPతో రాజీనామా చేయించి అందరిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజలు క్షమించరు’ అని పేర్కొంది.
News March 16, 2026
పశ్చాత్తాపం అంటే ఇదేనేమో.. దొంగిలించిన నగలను తిరిగిచ్చాడు!

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ వింత ఘటన జరిగింది. ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దంపతుల బంగారు నగలను కాజేశాడో దొంగ. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అనుకున్నాడో ఏమో.. 20 రోజుల తర్వాత ఆ నగలను బాధితుల ఇంటికే కొరియర్‌లో పంపించాడు. ఇంటి ముందున్న పార్సిల్ చూసి షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వేలిముద్రల ఆధారంగా దొంగ ఎవరో తేల్చేపనిలో పోలీసులున్నారు.


